ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సచివాలయంలో తనకు కేటాయించిన నూతన ఛాంబర్‌లో అడుగుపెట్టారు. పూజలు నిర్వహించిన అనంతరం తనకు కేటాయించిన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం సోమిరెడ్డికి పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాలకంటే వ్యవసాయానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa