ముంబై: ముంబైలో నిలువ చేసిన ఇంధన ట్యాంకర్లకు నిప్పు అంటుకున్నది. దీంతో భారీగా మంటలు వ్యాపిస్తున్నాయి. బుచర్ దీవుల్లో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలం నుంచి భారీ ఎత్తున మంటలు వ్యాపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దట్టమైన నల్లటి పొగ కూడా ఆకాశాన్ని కమ్మేస్తున్నది. శుక్రవారం రాత్రి ఫ్యూయల్ ట్యాంక్‌లకు నిప్పు అంటుకున్నట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa