ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసు శాఖకు ఏఆర్ విభాగం వెన్నెముక: డిఐజి సెంథిల్ కుమార్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 27, 2022, 09:17 AM

పోలీసు శాఖకు ఏఆర్ విభాగం వెన్నెముక వంటిదని డిఐజి సెంథిల్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగిన ఈ ఆర్ వార్షిక మొబలైజేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ఏ ఆర్ అధికారులు , సిబ్బంది విధి నిర్వహణలో వృత్తి నైపుణ్యంతో పాటు అంకితభావంతో పని చేయాలన్నారు. ట్రైనింగ్ సెంటర్ వద్ద సీఎం సి హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్యులు ఫస్ట్ ఎయిడ్ లైఫ్ సేవింగ్ ప్రొఫెసర్పై ఏఆర్ సిబ్బందికి మెలకువలు నేర్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి డి ఎన్‌ మహేష్ , ఏఆర్ డీఎస్పీ లు , ఎస్ లక్ష్మి నారాయణ రెడ్డి, కృష్ణ మోహన్, దిశ డిఎస్పి బాబు, ప్రసాద్ ఆర్ఐలు జావిద్ , మధు , ఎం టి వో నాగభూషణం మురళీధర్ ఆర్ ఎస్ఐలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa