తిరుమలలో పల్స్ పోలియో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. కొండపై 25 ప్రాంతాల్లో పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. 21 ప్రాంతాల్లో భక్తులకు, 4 ప్రాంతాలలో స్థానికులకు చుక్కలు వేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్చి 1 వ తేదీ వరకు పల్స్ పోలియో నిర్వహిస్తారు. 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని టీటీడీ కోరింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa