కర్ణాటకలోని ఓ కళాశాల తీరుపై స్వచ్చంద సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకావడానికి వెళ్లిన అమ్మాయిలను కాలేజ్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ వెనక్కి పంపించేశారని కాలేజ్ అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. తన మీద కక్ష పెంచుకుని పదేపదే ఆరోపణలు చేస్తున్నారని కాలేజ్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల నుంచి హిజాబ్ వేసుకున్నామని మమ్మల్ని కాలేజ్ లోకి రానివ్వడం లేదని, యూట్యూబ్ లో చదువుకుని పరీక్షలకు హాజరైతే మమ్మల్ని పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వలేదని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు మద్యంతర ఆదేశాలను మేము పాటిస్తున్నామని, హిజాబ్ లు వేసుకుంటే పరీక్షలు రాయడానికి తాము అనుమతి ఇవ్వలేమని కాలేజ్ అధ్యాపకులు అంటున్నారు. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెలుతున్న అమ్మాయిలు పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వాలని పలు స్వచ్చంద సంస్థలు కాలేజ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని ఉడిపిలోని ప్రభుత్వ గర్ల్ కాలేజ్ లో హిజాబ్ వివాదం మొదలై కర్ణాటకతో పాటు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విసయం తెలిసిందే. హిజాబ్ వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. హిజాబ్ లు వేసుకుని ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరుకావడానికి వెళ్లిన అమ్మాయిలను కాలేజ్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ వెనక్కి పంపించేశారని కాలేజ్ అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. ఉడిపిలోని ప్రభుత్వ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు హిజాబ్ లు వేసుకున్నారని కొన్ని రోజుల క్రితం కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ, అధ్యాపకులు వెనక్కి పంపించేసిన విషయం తెలిసిందే. ఇదే కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు కొందరు హిజాబ్ ల విషయంలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే తన మీద కక్ష పెంచుకుని పదేపదే ఆరోపణలు చేస్తున్నారని, గతంలో కూడా ఇదే విదంగా ఆరోపణలు చేశారని ఉడిపి ప్రభుత్వ గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ విచారం వ్యక్తం చేస్తున్నారు. మేము హైకోర్టు మద్యంతర ఆదేశాలు పాటిస్తున్నామని, హిజాబ్ లు తీసేసి పరీక్ష్లలకు హాజరుకావాలని చెబితే కొందరు అమ్మాయిలు పరీక్షలు బహిష్కరించి వెళ్లిపోయారని కాలేజ్ ప్రిన్సాపాల్ రుద్రేగౌడ అంటున్నారు. రెండు నెలల నుంచి హిజాబ్ వేసుకున్నామని మమ్మల్ని కాలేజ్ లోకి రానివ్వడం లేదని, యూట్యూబ్ లో చదువుకుని పరీక్షలకు హాజరైతే మమ్మల్ని పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వలేదని అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. హిజాబ్ లు వేసుకోకుండా తాము పరీక్ష్లలు రాయలేమని మరోసారి కాలేజ్ అమ్మాయిలు ఆరోపించారు. హిజాబ్ లు తీసేయాలని, లేదంటే ఐదు నిమిషాల్లో బయటకు వెళ్లిపోవాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కాలేజ్ ప్రిన్సిపాల్ రుద్రేగౌడ బెదిరించారని కాలేజ్ అమ్మాయిలు ఆరోపిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు మద్యంతర ఆదేశాలను మేము పాటిస్తున్నామని, హిజాబ్ లు వేసుకుంటే పరీక్షలు రాయడానికి తాము అనుమతి ఇవ్వలేమని కాలేజ్ అధ్యాపకులు అంటున్నారు. శివమొగ్గలో హిజాబ్ లకు అనుమతి ఇవ్వకపోవడంతో 20 మంది కాలేజ్ అమ్మాయిలు పరీక్షలు రాయకుండా ఇంటికి వెళ్లిపోవడం హాట్ టాపిక్ అయ్యింది. హిజాబ్ లు వేసుకుని కాలేజ్ కు వెలుతున్న అమ్మాయిలు పరీక్షలు రాయడానికి అవకాశం ఇవ్వాలని పలు స్వచ్చంద సంస్థలు కాలేజ్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa