ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన యువతికి ఫోన్‌లో రాజేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. వారిద్దరి మధ్య కాలక్రమంలో చనువు పెరిగింది. ప్రేమించానని అతడు చెప్పడంతో ఆమె సరేనంది. దీంతో ఆ యువకుడు బాధిత యువతిని ఫిబ్రవరి 22న తెలంగాణలోని తన స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మంగళవారం ఓ లాడ్జికి తీసుకెళ్లి, మద్యం తాగించాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులను పిలిచి, వారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. వ్యభిచార ముఠాలను సంప్రదించి, ఆ యువతిని విక్రయించాలని ప్లాన్ వేశాడు. స్పృహలోకొచ్చిన యువతి తన పరిస్థితి డయల్ 100కు ఫోన్ చేసి వివరించింది. అప్పటికే ఆ అమ్మాయి మిస్ అయినట్లు మంగళగిరిలో ఫిర్యాదు నమోదైంది. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు వెనువెంటనే స్పందించి యువతిని రక్షించారు. నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి పంపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa