వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం రాత్రి ఇప్పుడు లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినుకొండ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఇప్పటి నుంచే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ పార్టీని బలోపేతం చేసి అధికారమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa