విశాఖపట్నం: నర్సీపట్నం తుని రహదారిలో నాతవరం మండలం తాండవ జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీస్ స్టేషన్ సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa