సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) మరో రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 18వ తేదీ రాత్రి 11 గంటలకు విశాఖపట్నం నుంచి చర్లపల్లికి ఒక రైలు బయలుదేరుతుంది. 19న మధ్యాహ్నం 3.30 గంటలకు చర్లపల్లి నుంచి విశాఖపట్నంకు మరో రైలు ప్రారంభమవుతుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, అనపర్తి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్ల కోసం బుకింగ్స్ బుధవారం ఉదయం నుంచి అందుబాటులోకి వస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa