భారత రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మేర త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకోసం జింద్‌లో దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ రైలు కేవలం నీటి ఆవిరి, వేడిని మాత్రమే విడుదల చేస్తుంది కాబట్టి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ప్రస్తుతం ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ అద్భుత ఘట్టం భారతీయ రైల్వేల పురోగతికి నిదర్శనం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa