ఈస్ట్ సబ్ డివిజన్లోని లాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, సంగడిగుంట ప్రాంతంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 58 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. నగరంలో అసాంఘిక కార్యక్రమాలను అరికట్టేందుకు ఈ ఆపరేషన్ చేపట్టామని, ప్రజలు తమ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని, గంజాయి వంటి మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa