గత వారం రోజులుగా పర్యాటక కేంద్రమైన అరకులోయ పట్టణంలో ద్విచక్ర వాహనాలు చోరీలకు గురవుతున్నాయి. ఈ మేరకు సిసి ఫుటేజ్ లో ఫొటోల రికార్డు ఆధారంగా స్థానికులు గుర్తించి మండలంలోని ఎండపల్లివలస రైల్వే స్టేషన్ వద్ద తిరుగుతున్న దొంగలను పట్టుకున్నారు. స్థానికులు ఆ ఇద్దరి దొంగల వద్ద ఉన్న వాహనాలు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa