గుంటూరు జిల్లా తాడేపల్లి లో పోలీసులు రూ. 10 వేల విలువైన నిషేధిత గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లి పోలీసులు అందిన పక్కా సమాచారం ప్రకారం జాతీయ రహదారి స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న ఓ దుకాణంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ. 10 వేల విలువచేసే నిషేధిత గుట్కా లను కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకోవడంతో పాటు విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. వీరికి గుట్కాలను ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa