విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ పార్టీ నిరసనకు దిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరిన్ని పార్టీలను కలుపుకుని వెళ్లాలని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ యోచిస్తోంది. ఇందులో భాగంగా 120 మందికి పైగా ఎంపీలు సంతకాలు చేసి ప్రధాని నరేంద్ర మోదీకి ఇవ్వనున్నారు.లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొనిపోతాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తాం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa