ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇసుక కొరత కారణంగా...నిలిచిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 10:54 PM

 ఇసుక కొరత కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వకాలను రాష్ట్ర ప్రభుత్వం జేపీ వెంచర్స్ కంపెనీకి అప్పగించింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఇసుకను మేఘా తరలిస్తుండగా జేపీ వెంచర్స్‌ ప్రతినిధులు అడ్డుకున్నారు.దీంతో 250 టిప్పర్లు నిలిచిపోయాయి. ఇసుక తవ్వకాలన్నీ తమ కంపెనీవేనని, తమ అనుమతి లేకుండా ఇసుకను ఎలా తరలిస్తారని జేపీ వెంచర్స్‌ ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన ఇసుకను తరలించేందుకు తమకు అనుమతి ఉందని మేఘా కంపెనీ ప్రతినిధులు వాదించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa