ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ చర్చి నిర్మాణం చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 09:43 AM

పెద్దపప్పూరు మండలంలోని పెద్దఎక్కలూరులోని అంబేద్కర్ కాలనీలో అక్రమ చర్చి నిర్మాణం చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని గ్రామస్తులు తహశీల్దార్, పంచాయతీ సెక్రటరీకి వినతిపత్రం అందచేశారు. చర్చి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవని కావునా చర్చి నిర్మాణం పూర్తిస్థాయిలో అనుమతులు కలెక్టర్తో తీసుకుని నిర్మాణం జరపాలని అంతవరకు చర్చి నిర్మాణం జరపకూడదని గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇప్పటి వరకు చర్చి నిర్మాణం యాజమాన్యానికి మూడు మార్లు నోటీలు అందచేశారన్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నోటీసులను బేషరత్ చేసి ఆ నోటీసును దిక్కరించి చట్టాన్ని గౌరవించకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అక్రమంగా చర్చి నిర్మాణం చేపడుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చర్చి నిర్మాణం ఆపాలని విహెచ్పి నాయకులు వినతిపత్రం అందచేశారు. లేనిపక్షంలో అక్రమ చర్చి నిర్మాణం ఆపేవరకు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్ రెడ్డి, గంగాధర్, గాంధీ, లక్ష్మిరెడ్డి, రమణయ్య, అఖిల్ కుమార్ రెడ్డి, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa