గొలుగొండ మండలం నిమ్మగెడ్డ గ్రామం నుంచి రెండు బైక్ లపై తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో గొలుగొండ సిఐ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన గొలుగొండ ఎస్ఈబి స్టేషన్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి పట్టుబడ్డ గంజాయిని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి తరలిస్తూ పట్టుబడిన నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రెండు బైక్ లు 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa