ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూతబడ్డ పెట్రోల్ బంక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:46 AM

డుంబ్రిగుడ మండల కేంద్రంలో గల హెచ్ పీ సి ఎల్, జి సీ సీ ఆధ్వర్యంలో గత రెండు వారాలు నుంచి డీజిల్, పెట్రోల్ లేకపోవడంతో ఇక్కడి మండలాల్లో గల వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బంకులో పెట్రోల్ లీటర్ 110 , డీజిల్ 96 రూపాయలు ఉంటే ప్రవేట్ వ్యాపారస్తులు పెట్రోల్ 130 రూపాయలు, డీజిల్ 120 రూపాయలు చొప్పున విక్రయాలు చేస్తున్నారు.


దీంతో దిక్కులేక వాహనదారులు ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద నుంచి కొనుగోలు చేసి వాహనాలు నడిచే పరిస్థితి ఏర్పడింది. ఒకపక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఆరు మాసాలకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపు తుండగా మరోపక్క అధికారకంగా విక్రయాలు చేపట్టే పెట్రోల్ బంకులు మూతపడ్డాయి తో దీన్ని ఆసరా చేసుకున్న ప్రవేట్ వ్యాపారస్తులు మరి అంత ధరలు భారాన్ని సామాన్యులపై వారి బతుకులను చీల్చి చెండాడుతూన్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ మూత పడినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం పై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa