ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివాహిత ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:47 AM

విశాఖ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకున్నది. ఈనాడు కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. కశింకోట మండలం తీడ గ్రామంలో మంగళవారం సాయంత్రం ఏలేరుకాలువలో పడి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన మాసారపు సత్యవతి (45) సాయంత్రం సమయంలో బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. మాసయ్యపేట వద్ద ఏలేరుకాలువలో మృతదేహం తేలడంతో కుటుంబసభ్యులు గుర్తించారు. అనారోగ్యం, కుటుంబసమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈమెకు భర్త, కుమార్తె ఉన్నారు. ఈసంఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa