ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతిగా ఆశపడితే అంతే మరి!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 10:48 AM

ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ అధిక డబ్బులకు ఆశపడి ఓ వ్యక్తి దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకున్నది. ఈనాడు కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. విశాఖ నగర ఏడీసీపీ శ్రావణ్‌కుమార్‌, ఏసీపీ పెంటారావు, సీఐలు సూర్యనారాయణ, అవతారంలతో కలిసి మంగళవారం వెల్లడించారు. పెదగంట్యాడ దరి నెల్లిముక్కు గ్రామానికి చెందిన రాజేశ్వరి ఈనెల 14 పిల్లలను పాఠశాల నుంచి తీసుకొచ్చేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో సుమారు పావు తక్కువ ఏడు తులాల బంగారు ఆభరణాలు, రూ.2 వేల నగదు పోయినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే ఇంటి మేడపై ఉంటున్న పి.సూర్యనారాయణపై అనుమానం వ్యక్తం చేయటంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించే సరికి, అతను చేసిన మరో దొంగతనం గురించి కూడా చెప్పాడు.


శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం పంగవానిపేటకు చెందిన పి.సూర్యనారాయణ పరవాడ ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా చేస్తున్నాడు. రమణ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న సుమారు 8 తులాల బంగారు ఆభరణాలను దొంగతనం చేసి వాటిని తన ఇంట్లోని కరెంటు బోర్డులో దాచాడు. కిటికి తలుపులు తీసి ఇంట్లోకి ప్రవేశించినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి సుమారు 15 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ అవతారం, ఎస్సై సునీల్‌, కానిస్టేబుళ్లు ఆనంద్‌, ప్రతాప్‌, నర్సింగరావులను ఏడీసీపీ అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa