ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన ఎమ్మెల్యేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:00 PM

ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదం నెలకొంది. ఇక మంగళవారం విజిల్స్ ఊదిన టీడీపీ ఎమ్మెల్యేలు తాజాగా బుధవారం మరో సంచలనానికి తెరలేపారు. స్పీకర్ ఎదుట చిడతలు వాయించుతూ నిరసన తెలిపారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మరణాలపై అసెంబ్లీలో వినూత్న నిరసన తెలియజేశారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు చిడతలు వాయించిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, జోగి రమేష్ డిమాండ్ చేశారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీపై విరుచుకుపడ్డారు. దేశంలో చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టిందే చంద్రబాబు అన్నారు. అధికారం కోల్పోయే ముందు 5 ఏళ్లు బార్లు నడవడానికి చంద్రబాబు పరిష్మన్ ఇచ్చినట్లు తెలిపారు. సారాను ప్రోత్సహించింది, మద్యపాన నిషేధాన్ని ఎత్తి వేసింది చంద్రబాబే అని విమర్శించారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో సారాకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలకు సిగ్గుండాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa