ట్రెండింగ్
Epaper    English    தமிழ்

40 మంది మహిళలతో మాయగాడి రాసలీలలు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 23, 2022, 12:01 PM

ఆ యువకుడు తాను ఒక మోడల్‌ అని మహిళలకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారితో చనువు పెంచుకుని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది మహిళల జీవితాలతో ఆటలాడాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని ఇలా తన బుట్టలో వేసుకున్నాడు. చివరికి ముగ్గురు యువతులు ఈ మాయగాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


చెన్నైలోని పురుషవాక్కం మిల్లర్స్‌రోడ్డు ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ సయీద్‌(26) మోడలింగ్‌‌లో ఉన్నాడు. అయితే తాను ఎంచుకున్న రంగంలో రాణించాలని కాకుండా అక్కడి అమ్మాయిలపై కన్నేశాడు. ప్రేమిస్తున్నానంటూ యువతులు, మహిళల వెంట పడేవాడు. ఆ తర్వాత ఒకరికి తెలియకుండా మరొకరితో సంబంధం కొనసాగించాడు. ఇలా సాగుతుండగా ముగ్గురు యువతులు నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్‌ను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ జీవితాలను నాశనం చేశాడని నిందితుడిపై ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. నిఘా పెట్టగా పోలీసులు కూడా నివ్వెరబోయేలా వాస్తవాలు తెలిశాయి. అతడు ప్రేమ పేరుతో 40 మంది యువతులు, మహిళలను తన వలలో వేసుకున్నట్లు తెలుసుుకుని ఆశ్చర్యపోయారు. అతడిని సోమవారం అరెస్టు చేసి, విచారించగా తాను చేసిన మోసాలను స్వయంగా వెల్లడించాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa