యూపీలోని ఖుషీనగర్‌లో బుధవారం విషాదం సంభవించింది. చాక్లెట్లు తిని అనారోగ్యం పాలైన నలుగురు చిన్నారులు మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా 2 నుంచి 6 ఏళ్ల వయసు ఉన్న వారేనని అధికారులు పేర్కొన్నారు. ఉదయం ఓ వృద్ధురాలు ఇంటి ముందు ఊడుస్తుండగా తలుపు వద్ద కవర్ కనిపించిందని స్థానికులు తెలిపారు. దాన్ని తెరిచి చూస్తే చాక్లెట్లు కనిపించాయని పేర్కొన్నారు. వాటిని ఆమె పక్కింట్లో ఉన్న ముగ్గురు మనవళ్లకు, మరో చిన్నారికి చాక్లెట్ ఇచ్చిందన్నారు. వారు తిన్న కొద్దిసేపటికే ఆ ఘోరం జరిగిందని వాపోయారు. నలుగురు చిన్నారులు స్పృహతప్పి పడిపోయారని, ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు. ఊహించని ఘటన స్థానికులను కలచివేసింది. ఈ విషాద ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa