ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యార్దులకు సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. వాటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు. జూన్ చివరి నాటికి టెన్త్ ఫలితాలు.
మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు. జూలై మొదటి వారం లోగానే ఇంటర్ ఫలితాల వెల్లడి.
జూలై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు.
జూలై 11,12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్షలు.
ఆగష్టులో ఫలితాలు, సెప్టెంబర్ లో కౌన్సెలింగ్ మరియు క్లాసుల ప్రారంభం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa