ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూకు అరుదైన గుర్తింపు లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల కంటే ముందే రాష్ట్రంలో ఉర్దూకు రెండో అధికార భాషగా గుర్తింపు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనకు అనుగుణంగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగానే పలు బిల్లుల మాదిరిగానే ఉర్దూ బిల్లును కూడా అసెంబ్లీ ముందు పెట్టింది. బుధవారం జరిగిన సమావేశాల్లో భాగంగా ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa