మీ పాన్ (పర్మినెంట్ ఖాతా నంబరు)ను ఆధార్‌తో అనుసంధానం చేశారా? ఒకవేళ చేయకుంటే ఈ రోజే ఆ పని పూర్తి చేయండి. పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయడానికి గురువారం (31వ తేదీ)తో గడువు ముగియనుంది. గడువు తర్వాత ఏప్రిల్ ఒకటి నుంచి 3 నెలల్లో లేదా జూన్ 30 నాటికి అనుసంధానం చేస్తే రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ.1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా 2023 మార్చి వరకు పాన్ పనిచేస్తుందని, ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది. పాన్-ఆధార్ అనుసంధానం, అనుసంధానం అయినదీ లేనిదీ ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa