ఉగాది పండగ ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు శుభవార్త. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల నేపథ్యంలో కరువు భత్యం(డీఏ)ను కేంద్రం 3ు పెంచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఈ పెంపును అమలు చేయనున్నట్టు తెలిపింది. తాజా పెంపుతో డీఏ 34 శాతానికి చేరింది. దీంతో 47.68 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68.62 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.9,544.50 కోట్ల అదనపు భారం పడనుందని ప్రభుత్వం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa