ఏపీలోని అనంతపురం పెద్దవడుగూరు మండలంలో శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిడుతూరు గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీవ్రగాయాలైన ఆరుగురిని అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి, మిగిలిన వారిని గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.