విద్యుత్ షాక్ తో ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఉండ్రాజవరం మండలం కె.సవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవిబోస్ (36) కరెంటు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం టీచర్స్ కాలనీలోని ఓ ఇంట్లో సర్వీస్ వైరుకు కనెక్షన్ ఇవ్వాలని విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఈ సమయంలో విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. వెంటనే 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa