ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి విద్యుత్ చార్జీల భారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 04:03 PM

రెండేళ్ల నుంచి కరోనాతో కుటుంబ జీవనం అస్తవ్యస్తం అయిన క్రమంలో ప్రభుత్వాలు సామాన్యన్ని ఆదుకోవడంపోయి.. అధిక ధరలతో కుటుంబాలను చిద్రచేయాలని చూస్తున్నాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. బుధవారం విద్యుత్తు చార్జీలను పెంచుతున్నట్లు ఏపీ ఈఆర్ సీ ప్రకటించింది. ఇప్పుడున్న స్లాబులను రద్దు చేసింది. కొత్తగా ఆరు స్లాబులను ప్రకటించింది. విద్యుత్తు చార్జీలు ఇప్పుడెందుకు పెంచాల్సి వచ్చిందంటే.. రానున్న రోజుల్లో 11వేల 133 కోట్లు సబ్సిడీగా ఇవ్వనున్న క్రమంలో వీటిని పెంచాల్సి వచ్చింది అంటూ ఏపీ ఈఆర్ సి చైర్మన్ నాగార్జునరెడ్డి ముకాయింపునిచ్చారు.


సుర్రుమంటున్న సర్ ఛార్జీలు


గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట రోజు స్పెషల్ డ్రైవ్ ను ఏర్పాటు చేసుకున్న విద్యుత్తుశాఖ ప్రతి గృహంలో వారు వినియోగించే విద్యుత్తును 'లెక్క' తీస్తున్నారు. సంవత్సరం మొత్తం వాడిన విద్యుత్తుకు సంబంధించి సరాసరి లెక్కలు తీసి ఏసిడి ఛార్జీలు మోపుతున్నారు. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. యూనిట్ విద్యుత్ చార్జీ రూ.1.45 ఉంటే సర్ ఛార్జీ రూ.1.47 ఉంటోంది. కాగా ఇప్పడు కొత్తగా వచ్చిన ఆరు స్లాబులతో సర్ చార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే విద్యుత్ ఛార్జీ కంటే సర్ ఛార్జీ ఎక్కువగా ఉండటం విశేషం. అదే విధంగా వినియోగదారులను ఛార్జీ అంటూ కొంత, ఆపై సెస్సుతోను భారీగా బాదేస్తున్నారు.


గత ఏడాది రెండు గదులున్న సామాన్య వినియోగదారుడు సుమారు రూ.520 బిల్లు చెల్లిస్తే ఈ ఏడాది రూ.920 చెల్లించాడు. అంటే 80 శాతం విద్యుత్తు ఛార్జీ పెరిగినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 12.28 లక్షల గృహ వినియోగదారులు, 67 వేలు వ్యవసాయం, 11 వేల 500 పరిశ్రమలకు చెందిన విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. అంటే పెంచిన విద్యుత్తు ఛార్జీలను బట్టి చూస్తే సుమారు రూ. 64 కోట్లు విద్యుత్తు సంస్థలకు ఆదాయం సమకూరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదే విధంగా ఏసీడీ పేరుతో మరో వంద కోట్ల బాదుడుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.


ఇక వ్యవసాయ విద్యుత్తు సర్వీసులను పరిశీలిస్తే గతంలో సర్వీస్ ఛార్జీ రూ.20వసూలు చేయగా ప్రస్తుతం దానిని రూ.30 వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రతి మూడు మాసాలకు వసూలు చేసే ఛార్జీలు అన్నీ సుంకాలతో కలిపి రూ.220 పైగా వసూలు చేస్తున్నారు. 500 వాట్స్ లో ఉండే కాంట్రాక్టు లోడు వాడే వినియోగదారులకు పాత దాని ప్రకారం విద్యుత్తు ఛార్జీ రూ.1.45 ఉంటే సర్ ఛార్జీ రూ.1.47 ఉంటోంది. 50 యూనిట్లు దాటితే యూనిట్ కు రూ.2.60 బాదేస్తున్నారు. కాగా కొత్తగా వచ్చిన ఆరు స్లాబులతో మరింత పెరిగే అవకాశం ఉంది.


ఇదిలా వుండగా మున్సిపాలిటీలో 2కిలోవాట్ మీటర్లును తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కిలోవాట్ మీటర్ కు రూ.1525 డీడీ యూనిట్లు తీయాల్సి ఉన్న నేపథ్యంలో 2కిలోవాటి కు రూ.3225 మీటరు తీసుకోవాలి. విద్యుత్తుశాఖ విధానాల ప్రకారం చూస్తే ప్యాన్ కు 260 వాట్స్, ఏసికి 1800, 1హెచ్ పి మోటారుకు 750 వాట్స్, ట్యూబ్ కు 30 నుంచి 60 వాట్ వరకు ఉంటుందని లెక్కలు తేల్చారు. దీంతో ఇప్పటి వరకు 1కిలో వాట్ మీటరు ఉన్న వినియోగదారులకు ఇక నుంచి ఏసీడీ మోత మోగనుంది. దీంతో వారికి గణాంకాల ప్రకారం రూ.3 వేల నుంచి 5 వేల వరకు ఏసీడీ వచ్చే అవకాశాలున్నాయి.


పట్టణాల సంగతి ఎలా ఉన్నా గ్రామీణులు విద్యుత్తు బిల్లులంటేనే హడలిపోతున్నారు.జిల్లాలో 12.28 లక్షల సర్వీసులు ఉంటే అందులో 60 శాతం గ్రామాల్లో ఉంటున్నాయి. అసలు బిల్లులకే డబ్బులేని పరిస్థితులలో బిల్లు సర్ ఛార్జీలు, ఏసిడి ఛార్జీలు వస్తుండటంతో వారు కట్టలేకపోతున్నారు.


బిల్లుల వసూళ్లపై అధికారుల దృష్టి


జిల్లాలో విద్యుత్తు వాడకం బిల్లుల వసూలుపై జిల్లా అధికారులు మూడు రోజులకు ఒకసారి సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్తు బిల్లు చెల్లించని వారిపై చర్యలు తీసుకోవటమే కాకుండా వారి సర్వీసులను తొలగించాలని స్థానిక ఏఈ, ఏడిఈలను ఆదేశించినట్లు ఎమాచారం. అయితే అనేక గ్రామాలలో బిల్లు చెల్లించకపోవటంతో ఆయా గ్రామాలకు విద్యుత్తు సరఫరాను నిలిపి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రామీణులతో స్థానిక అధికారులకు వివాదాలు జరుగుతున్నాయి. రాజకీయ నేతలు రంగంలోకి దిగి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు చెపుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు చెప్పలేక..ఇటురాజకీయనాయకుల మాటలు వినలేక స్థానిక అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa