ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కరోనా యాక్టియ్ కేసులు 202గా నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 10:10 PM

ఏపీలో నిన్న 251గా ఉన్న కరోనా యాక్టివ్ కేసులు, నేడు 202కి తగ్గాయి. గడచిన 24 గంటల్లో 9,394 కరోనా పరీక్షలు నిర్వహించగా, 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కొత్త కేసులు వెల్లడయ్యాయి. చిత్తూరు జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 4 కేసులు గుర్తించారు.  అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,560 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 23,04,628 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 14,730 మంది మరణించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa