పరీక్షల్లో కాపీ కొడితే డీబార్ చేస్తాం...లేకపోతే మరోదైనా శిక్ష విధిస్తారు. కానీ ఇక్కడో వింత ఘటన చోటుచేసుకొంది. పరీక్షల్లో కాపీ కొడుతున్న విద్యార్థిని పట్టుకున్న ఓ లెక్చరర్ ఆగ్రహంతో అతడి చెయ్యిని కొరికేశాడు. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హొసనగర తాలూకాలోని డిగ్రీ కళాశాలలో జరిగిందిది. ఇక్కడ బీఏ పరీక్షలు జరుగుతుండగా ఓ విద్యార్థి కాపీ కొడుతుండడాన్ని ఇన్విజిలేటర్‌గా ఉన్న అధ్యాపకుడు గమనించి పట్టుకున్నారు. దీంతో విద్యార్థి, అధ్యాపకుడు మధ్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన లెక్చరర్ విద్యార్థి చెయ్యి కొరికేశారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరగ్గా కొందరు విద్యార్థులు బయటపెట్టడంతో తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై విద్యార్థి, లెక్చరర్ పరస్పరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే, ఆ తర్వాత రాజీపడి కేసులు ఉపసంహరించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa