ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గించిన భారత్...కారణమిదే

national |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 03:46 PM

కరోనా బలహీనపడుతున్న నేపథ్యంలో భారత్  కీలక నిర్ణయం తీసుకొంది. కరోనా టీకా కొవాగ్జిన్ ఉత్పత్తిని తాత్కాలికంగా తగ్గిస్తున్నట్టు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ నిన్న ప్రకటించింది. టీకాలకు క్రమంగా డిమాండ్ తగ్గుతుండడం, టీకా సేకరణ సంస్థలకు ఒప్పందం మేరకు టీకాల సరఫరా పూర్తికావడంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా అత్యవసర పరిస్థితుల్లో కొవాగ్జిన్ టీకాను భారీగా ఉత్పత్తి చేయడం, అందుకోసం ఏడాది కాలంగా తమ ఉత్పత్తి కేంద్రాలన్నీ నిరంతరాయంగా పనిచేశాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఇప్పుడీ కేంద్రాలన్నింటినీ నవీకరించే ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఈ సదుపాయాలను మరింత సమర్థంగా వినియోగించే అంశంపై దృష్టిసారిస్తామని వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa