ఐటీ అంటేనే అందరికి గుర్తోచ్చేది ఇన్ఫోసిస్. భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ రష్యాలో తన ఆపరేషన్స్ క్లోజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మాస్కోలో ఉద్యోగం చేస్తోన్న స్టాఫ్ కోసం విదేశాల్లో రీప్లేస్‌మెంట్ రోల్స్ కోసం కంపెనీ చూస్తుందని బీబీసీ రిపోర్టు చేసింది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకోవడం ప్రారంభించిన తర్వాత.. తన రష్యన్ ఆపరేషన్స్‌ను మూసివేయాలని ఇన్ఫోసిస్‌పై ఒత్తిళ్లు వచ్చాయి. రష్యాలో ఉన్న ఈ సంస్థలో నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తికి ఉన్న షేర్లపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. యూకే ఛాన్సలర్ రిషి సునక్‌కు అక్షతా భార్య. ఒక యూకే ఆర్థిక మంత్రి ఫ్యామిలీ మెంబర్లు రష్యాతో బిజినెస్‌లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ఓ సంస్థ రిషి సునక్‌ను ప్రశ్నించింది. దీనిపై రిషి సునక్ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కంపెనీ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చిచెప్పారు. యూరోపియన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తోన్న సమయంలో.. ఆయన భార్యకు రష్యాలో ఉన్న ఇన్ఫోసిస్‌లో వాటాలు ఉండటంపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇన్ఫోసిస్ కార్యకలాపాలలో నిర్ణయాలలో అక్షతా పాత్ర ఏమీ లేదని సునక్ అధికార ప్రతినిధి చెప్పారు. కాగా, ఇన్ఫోసిస్ ఇటీవల సమర్పించిన యాన్యువల్ రిపోర్టులో మాత్రం కంపెనీ షేర్లలో 0.9 శాతం వాటా అక్షతా మూర్తికి ఉన్నట్టు తెలిసింది. వీటి విలువ మిలియన్ పౌండ్లలోనే ఉంటోంది. ఈ విషయంపై అటు రెండు స్టాక్ ఎక్స్చేంజీలు ఎన్‌ఎస్ఈ, బీఎస్ఈలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు ఇన్ఫోసిస్. అతిపెద్ద ఐటీ సర్వీసెస్ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్.. రష్యాలో కూడా తన ఆపరేషన్స్‌ను సాగిస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ ప్రారంభమైన తర్వాత.. ఎస్ఏపీ, ఒరాకిల్, మెకెన్సీ, అసెంచర్, కేపీఎంజీ లాంటి చాలా సంస్థలు రష్యాలో తమ ఆపరేషన్స్‌ను క్లోజ్ చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa