ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్ డీలపై వడ్డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ

national |  Suryaa Desk  | Published : Sun, Apr 03, 2022, 02:00 AM

ఐసీఐసీఐ బ్యాంకు తన కష్టమర్లకు ఓ శుభవార్త అందించింది. దేశంలో చాలా బ్యాంకులు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ ఉంటాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల విషయానికి వస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. ఇందుకంటే అతిపెద్ద బ్యాంకుల్లో ఇది కూడా ఒకటి. ఐసీఐసీఐ బ్యాంక్ తాజగా కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు రూ. 2 కోట్లకు పైన, రూ. 5 కోట్లకు లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల మేర పెరిగింది. మార్చి 30 నుంచే ఈ పెంపు నిర్ణయం అమలులోకి వచ్చింది. ఏడాది నుంచి పదేళ్లలోపు కాలా పరిమితిలోని ఎఫ్‌డీలకు ఇది వర్తిస్తుంది. తాజా సవరణ ప్రకారం చూస్తే.. ఐసీఐసీఐ బ్యాంక్ జనరల్, సీనియర్ సిటిజన్స్‌కు ఏడాది నుంచి 389 రోజుల ఎఫ్‌డీలపై 4.2 శాతం వడ్డీని అందిస్తోంది. 390 రోజుల నుంచి 15 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. ఇది వరకు వీటిపై 4.15 శాతం వడ్డీ లభించేది. 15 నెలల నుంచి 18 నెలలలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీ వస్తోంది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 4.2 శాతంగా ఉంది. 18 నెలల నుంచి 2 ఏళ్లలోపు డిపాజిట్లపై ఇప్పుడు 4.35 శాతం వడ్డీని పొందొచ్చు. ఇది వరకు 4.3 శాతం వచ్చేది. రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లను గమనిస్తే.. 4.55 శాతం వడ్డీ వస్తుంది. ఇది వరకు ఈ రేటు 4.5 శాతం. మూడేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై4.65 శాతం వడ్డీ వస్తుంది. ఇది వరకు 4.6 శాతం వడ్డీ వచ్చేది. కొత్త డిపాజిట్లకు, అలాగే రెన్యూవల్ చేసుకునే డిపాజట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. ఇకపోతే 7 రోజుల నుంచి ఏడాదిలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఇకపోతే బ్యాంక్‌లో ఎఫ్‌డీ చేయాలని ప్లాన్ చేసే వారు ముందుగా వడ్డీ రేట్ల గురించి నిశితంగా తెలుసుకోండి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa