తమ దేశంలో దిగజారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి శ్రీలంక ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించింది. ఇదిలావుంటే తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత బలగాలు సాయం కోసం వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. దానిపై శ్రీలంక రక్షణ శాఖ స్పష్టతనిచ్చింది. భారత బలగాలు శ్రీలంకకు రాలేదని, వాళ్ల సాయం అవసరం లేదని రక్షణ శాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే చెప్పారు. పరిస్థితులను నియంత్రించడంలో స్థానిక బలగాలకు సామర్థ్యం ఉందన్నారు. దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ఆత్యయిక పరిస్థితినైనా వాళ్లు ఎదుర్కోగలరన్నారు. ఈ విషయంలో బయటి దేశాల సాయం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, మరిన్ని తీవ్రమైన ఆందోళనలు జరిగే ముప్పుందన్న వార్తల నడుమ ప్రభుత్వం సోషల్ మీడియా వాడకాన్ని బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు శనివారం 40 వేల టన్నుల డీజిల్ ను శ్రీలంకకు భారత్ పంపించింది. దేశంలో విద్యుత్ కోతలను నియంత్రించేందుకు వీలుగా ఈ డీజిల్ ను పంపించినట్టు అధికారులు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa