తాజా ఐపీఎల్ సీజన్‌లో భాగంగా ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చెన్నై. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బ్యాట్స్‌మెన్ లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. 32 బంతుల్లో 60 పరుగులు. దీంతో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (33), జితేష్ శర్మ (26) రాణించారు. 18 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయిన సీఎస్‌కే 54 పరుగుల తేడాతో ఓడిపోయింది.సూపర్ కింగ్స్ కు ఈ సీజన్ లో వరుసగా మూడో ఓటమి. పంజాబ్ కి ఇది రెండో విజయం. 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 126 పరుగులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa