ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లప్రోలు మండల పరిధిలో నేషనల్ హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. చెందుర్తి – వజ్రకూటం గ్రామాల మధ్య ప్రయాణికులతో ఉన్న ఆటోను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జు నుజ్జయింది. ఆటోలో ఉన్న ఓ మహిళ సంఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఆటోడ్రైవర్, ఇతర ప్రయాణికులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని, ప్రమాదం జరిగిన తీరు, మృతుల వివరాలపై ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa