యూపీలోని గోరఖ్ పూర్ లో అహ్మద్ ముర్తాజా అబ్బాసీ అనే కెమికల్ ఇంజినీర్ కత్తితో వీరంగం సృష్టించాడు. గోరఖ్ నాథ్ ఆలయం వద్ద ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తమను తాము రక్షించుకోవడానికి అతడిపై రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే 2017 నుంచి తన కుమారుడి మానసిక పరిస్థితి సరిగా లేదని అహ్మద్ ముర్తాజా అబ్బాసీ తండ్రి చెబుతున్నారు. ఈ ఘటనపై యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ దర్యాప్తు ప్రారంభించింది.