గత నెలలో హర్యానా రాష్ట్రంలో జరిగిన యోగ ఇండియన్ ఫెడరేషన్ పోటీల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి ఇద్దరు అంగన్వాడీ టీచర్లు హాజరయ్యారు. 50 సంవత్సరాలు పైబడిన వారిలో కృష్ణా జిల్లా నూజివీడు కు చెందిన అంగన్వాడి టీచర్ క్రిస్టియన్మ్మ ఈ యోగా పోటీల్లో తమ ప్రతిభను కనబరిచారు. 30 సంవత్సరాలు పైబడిన వారిలో నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ములుగు మాటి జ్యోతి కుమారి ఈ యోగా పోటీల్లో హాజరయ్యారు. సోమవారం నూజివీడు ఐసిడిఎస్ అధికారులు ఈ ఇద్దరు అంగన్వాడీ టీచర్లను ప్రత్యేకంగా అభినందించారు. యోగా పోటీల్లో పాల్గొన్న ఇద్దరు అంగన్వాడి టీచర్లకు ప్రతిభ ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేశారు.