రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం అందచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని 7వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ నౌషాద్ బేగం సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, నిర్వాహకులను మధ్యాహ్న భోజన వివరాలను, విద్యార్థుల హాజరు శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రోజు మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని సూచించారని, ఆ మేరకు విద్యార్థులకు భోజనం అందించాలని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలసి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు బాగుందని, విద్యార్థులు సైతం శ్రద్దగా చదువుకోవాలని సూచించారు. ఆమె వెంట పాఠశాల ఉపాధ్యాయులు జిలానీ, మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa