ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐపీఎల్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న 'ఆర్సీబీ'

sports |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 07:46 PM

ఐపీఎల్ 2022లో వరుసగా రెండు భఆరీ విజయాలతో ఉత్సాహంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు మరికొద్ది సేపట్లో బెంగళూరు జట్టును ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి బెంగళూరు టాస్ గెలిచినా, ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జోరు మీదున్న రాజస్థాన్ ప్రస్తుత మ్యాచ్‌లో ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓ విజయం, ఓ పరాజయంతో ఆర్సీబీ ప్రదర్శన అభిమానుల అంచనాలకు తగ్గట్టు లేదు. అయితే జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉండడంతో ఎప్పుడైనా వారు మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా కలిగి ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది.

రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్&కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగా, డేవిడ్ విల్లీ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa