పేలని జ గన్ హస్తీన పర్యటనకు ఎందుకు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఓ పోల్ పెట్టారు. ఈ పోల్‌లో అసలు జగన్ దేని కోసం ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రశ్నించిన లోకేశ్.. ఓ నాలుగు అంశాలను ప్రస్తావించారు. ఈ నాలుగింటిలో జగన్ దేనికోసం ఢిల్లీకి వెళ్లారని ఆయన పోల్ పెట్టారు. పేలని జ గన్ హస్తిన పయనమెందుకు? పేరిట లోకేశ్ సంధించిన ఈ పోల్‌లో తొలి అంశంగా 'బాబాయి హత్య కేసులో దొరికిపోయిన అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు' అని పెట్టారు. రెండో అంశంగా 'తాను కొట్టేస్తే కాగ్ పట్టేసిన రూ.48 వేల కోట్ల వ్యవహారాన్ని కామప్ చేసేందుకు' అని పేర్కొన్నారు. ఇక మూడో అంశంగా తనపై సీబీఐ, ఈడీ కేసుల దర్యాప్తును ఆపేయాలని అని పేర్కొన్నారు. నాలుగో అంశంగా లక్ష కోట్ల ఆస్తిలో చెల్లికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మహిళలకు ఆస్తి హక్కు రద్దు చేయాలని అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ పోల్ ఇప్పుడు వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa