ప్రముఖ సినీ దర్శకురాలు, ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో సెల్వమణిపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సమయంలో బోద్రాపై ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ పలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వీరిపై బోద్రా జార్జ్‌టౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. బోద్రా మరణం తర్వాత, అతని కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగించాడు. ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. అయితే సెల్వమణి, అరుల్ అన్బరస్ కోర్టుకు హాజరు కాలేదు. వారి తరపున న్యాయవాదులు కూడా రాలేదు. ఇద్దరిపై బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు.. కేసును మే 23కి వాయిదా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa