ఏసీల ధరలు పెరగనున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగిపోవడంతో కంపెనీలు ధరలు పెంచాలనుకుంటున్నాయి. ఈ వేసవి సీజన్ లో అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. అందుకే తయారీ భారాన్ని తగ్గించుకునేందుకు ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకు పెంచాలనుకుంటున్నాయి.
గత రెండు వేసవి సీజన్లలో కరోనా కారణంగా ఏసీల అమ్మకాలు ఆశించిన మేర లేవు. దీంతో అప్పుడు నిలిచిన డిమాండ్ కూడా తోడయ్యి, ఈ సీజన్ లో అమ్మకాలు జోరుగా ఉండొచ్చని వోల్టాస్, హిటాచి, ఎల్‌జీ, ప్యానాసోనిక్, గోద్రేజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తున్నాయి. ఏసీల తయారీలో వినియోగించే అల్యూమినియం, కాపర్ ధరలు గణనీయంగా పెరగడంతో ధరలను పెంచడం తప్పేలా లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa