ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీలంకలో అత్యవసర పరిస్థితి ఎత్తివేత

national |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 11:05 AM

శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు.శ్రీలంకలో విధించిన అత్యవసర పరిస్థితి ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన వెలువరించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు.


అత్యవసర పరిస్థితి: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో కొన్నిరోజులుగా ప్రజలు నిత్యవసరాల కోసం అల్లాడుతున్నారు. పెరిగిన ధరలు, ఆహార పదార్థాలు, విద్యుత్ కోతలు, ఇంధన కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించారు. దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలను అణచివేయడానికి రాజపక్స హుటాహుటిన అత్యవసర పరిస్థితి విధించారు. అత్యవసర పరిస్థితి సమయంలో ఎవరినైనా నిర్బంధించడం, ఏదైనా ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, దేశంలో ఎక్కడైనా సోదాలు జరిపే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa