ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాణస్వీకారం రోజునే మోసం చెయ్యడానికి కంకణం కట్టిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 01:18 PM

 జగన్ రెడ్డి బాదుడుకి జనం బెంబేలెత్తిపోతున్నారు. సీఎం గా ప్రమాణస్వీకారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు తగ్గించేస్తానని అబద్దం చెప్పింది దేశంలో ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. 7 సార్లు విద్యుత్ ధరలు పెంచి రూ.16 వేల కోట్లు కొట్టేసారు. నిత్యావసరాలు, డీజిల్, పెట్రోల్ ధరల్లో ఏపీని ఇండియాలోనే నెంబర్ 1 గా నిలిపి సామాన్యుల నడ్డి విరిచారు. అని టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ తెలిపారు. టీడీపీ పార్టీ బయటకి వస్తుందంటే వైసీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుడుతుంది అని అన్నారు దీనికి సాక్ష్యం ధర్నాలకు , ర్యాలీలకు , ప్రజల తరపున న్యాయం కోసం పోరాటం చెయ్యటానికి వస్తున్న ప్రతిపక్ష నాయకులను నిర్బంధించడం,అరెస్ట్ చెయ్యడం లాంటి చర్యలే అన్నారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వారి గోడు వినలే తప్ప , గొంతు నొక్కే పనులు ఏ  ప్రభుత్వానికి ఐన  మంచిది కాదు  అని హితవు పలికారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa