ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసా యాత్ర ఎవరికోసం పవన్...?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 03:30 PM

 జనసేన అధినేత,  పవన్ కళ్యాణ్ ను పొలిటీషియన్‌ అని ఎవరూ అనుకోవడం లేదని దేవాదాయ శాఖ మంత్రి  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు . పవన్‌కళ్యాణ్‌ ఈ రాష్ట్ర రాజకీయాలకి గెస్ట్‌ ఆర్టిస్టు లాంటి వాడు అని ఎద్దేవా చేశారు. ఈ మధ్య కాలంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొని వేరే రాష్ట్రం వెళ్లిపోయాడని, మళ్లీ ఇప్పుడు వచ్చి రైతు భరోసా యాత్ర అంటున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమం పేరును కూడా మా పార్టీ నుంచి కాపీ కొట్టాడని పేర్కొన్నారు. చంద్రబాబుకు పవన్‌ దత్తపుత్రుడని అందరికీ తెలిసిన విషయమే, చంద్రబాబు స్క్రిప్టు ప్రకారమే రైతు యాత్రలు చేస్తానంటున్నారని తెలిపారు. ఏం ముఖం పెట్టుకుని రైతుల వద్దకు పవన్‌ కళ్యాణ్‌ వెళ్తాడని నిలదీశారు. రైతుల కోసం పని చేసే ప్రభుత్వం మాదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకమనిచెపుతున్న సందర్భంలో బీజేపీతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. పవన్‌ వెంటనే బీజేపీ నుంచి బయటకు రావాలని హితవు పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa