ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో కొత్త జిల్లాలపై కేంద్రం కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 05:35 PM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు ఎల్‌జీడీ(లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ) కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులను జారీ చేసింది. జనాభా లెక్కింపు, ప్రభుత్వ పథకాల అమలు వంటి కీలక కార్యక్రమాలను ఎల్‌జీడీల ఆధారంగా జరుగుతాయి. దీంతో ఈ కీలక కోడ్‌లను కొత్త జిల్లాలకు కేంద్రం కేటాయించింది.

ఈ నెల 4 నుంచి అదనంగా మరో 13 జిల్లాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కొత్త జిల్లాలలో అదే రోజు నుంచి పాలన కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. మన్యం జిల్లాకు 743, అనకాపల్లి జిల్లాకు 744, అల్లూరి జిల్లాకు 745, కాకినాడ జిల్లాకు 746, కోనసీమ జిల్లాకు 747 కేటాయించింది. దీంతో పాటు ఏలూరు జిల్లాకు 748, ఎన్టీఆర్‌ జిల్లాకు 749, బాపట్ల జిల్లాకు 750 కోడ్‌ నంబర్లను నిర్ణయించింది. తిరుపతి జిల్లాకు 752, అన్నమయ్య జిల్లాకు 753, సత్యసాయి జిల్లాకు 754, నంద్యాల జిల్లాకు 755 నంబర్ల కోడ్‌ను కేటాయించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa