ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గాంధీజీ బాపట్లకు వచ్చి 101 ఏళ్ళు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 06:45 PM

బాపూజీ మహాత్మాగాంధీ బాపట్లకు తొలిసారిగా వచ్చి ఇప్పటికి నూటొక్క ఏళ్ళు అయిందని బాపట్ల ఫోరం ఫర్ బెటర్ కార్యదర్శి పీసీ సాయిబాబా పేర్కొన్నారు. 1961 ఏప్రిల్ 6 బాపూజి ప్రప్రథమంగా బాపట్ల ను సందర్శించారు. బాపూజీ పర్యటన ప్రజలను ఎంతో ఉత్తేజపరిచింది. బాపూజీ కోరిన విధంగా తిలక్ స్వరాజ్య నిధికి ప్రజలు పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు.


గాంధీజీ కారులో గుంటూరు నుంచి బాపట్ల కు వచ్చారు. అప్పికట్ల వద్ద సూర్యప్రకాశరావు గాంధీకి ఎదురెళ్లి స్వాగతం పలికారు. గాంధీజీ బాపట్లలో దేశిరాజు బాపయ్య ఇంట్లో అతిథ్యం పొందారు. అనంతరం బాపట్ల సభలో గాంధీజీ ప్రసంగించారు. న్యాయవాదులు ఏడు వేలు వసూలు చేసి స్వరాజ్య నిధికి సమర్పించారు. గాంధీజీ భాగంలో వచ్చే నూట ఒక్క సంవత్సరాలు అయిన సందర్భంగా బాపట్ల ఫోరం ఫర్ బెటర్ ఆధ్వర్యంలో బాపట్లలో బాపూజీ అనే కరపత్రాలు జిల్లా విద్యా శాఖ అధికారి రామారావు ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, విశ్రాంత ఉపాధ్యాయులు ఆర్య మణి భూషణ్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa